Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
26-02-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఆదర్శ కళాశాల, శ్రీ గాయత్రి కళాశాల, ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాల, టీజీ ఆర్ఎస్ జూనియర్ కళాశాలలను అధికారులు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తున్నట్లు సమాచారం. చౌటుప్పల్‌లోని ఐదు కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 1159 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 1125 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు.

Sthanikam

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News