Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

28-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు,

పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

ఆత్మకూరు,

పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News