Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

29-12-2025 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్‌ఐ హెచ్చరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులు, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసరంగా బయటకు వెళ్లి సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలని కోరారు. మండల ప్రజలు అందరూ శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు.

Sthanikam

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News