Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి అంబేద్కర్

14-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ సమీపంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం నడిపిన ఉద్యమ సూర్యుడు అని గుర్తు చేశారు. అంటరాని వారు పాఠశాలలో ప్రవేశం లేని కాలంలోనే తరగతి గది బయట కూర్చుని విద్యను అభ్యసించి, ప్రపంచ దేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించి అత్యున్నత స్థాయికి చేరుకున్న మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.

అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమమైందని తెలిపారు. అంబేద్కర్ జీవితాన్ని ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకొని నిరక్షరాస్యత లేని దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శులు అమరవాది శ్రవణ్, పర్వతం వెంకటేశ్వర్లు, దస్తగిరి, గోపాల్ రెడ్డి, చక్రు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న, బానోతు జానీ నాయక్, మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, పెగ్గిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి అంబేద్కర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News