Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:48 AM

పర్మిషన్ లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ.

పర్మిషన్ లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ.

పర్మిషన్ లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ.
May 27, 2026 07:15 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రభుత్వ అనుమతులు లేకుండా సీబీఎస్‌ఈ పేరుతో ప్రచారం చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్‌పై వెంటనే చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ మండల విద్యాధికారి (ఎంఈఓ)కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. ఇంటర్నేషనల్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాల ఫీజు వివరాలను పారదర్శకంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో స్టేషనరీ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని, మండల విద్యాధికారి కనుసైగల్లోనే ఇలాంటి పాఠశాలలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ద అక్షిత, మండల నాయకులు భూక్య సంతోష్, మామిడి నవీన్, ఏటెల్లి నిషితేజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News