Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు.

19-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వచ్చిన వార్తల ప్రభావంతో పోలీసులు వేగంగా స్పందించారు.

వెలుగుపల్లి గ్రామ శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదును ఆసుపత్రి వద్దనే స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేసినట్లు తెలిపారు.

రాష్ట్ర పోలీస్ శాఖ అమలు చేస్తున్న “డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్” విధానంలో భాగంగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని వివరించారు.

ఈ విధానం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Sthanikam

ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News