Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:24 AM

ప్రకృతి రక్షించుకుందాం,వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం,రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

ప్రకృతి రక్షించుకుందాం,వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం,రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

ప్రకృతి రక్షించుకుందాం,వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం,రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..
February 26, 2026 08:06 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ప్రజాకవి జయరాజు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాప అధ్యక్షులు రమేష్ పిలుపు..

వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని ప్రముఖ ప్రజాకవి డాక్టర్ జయరాజు,విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ తెలియజేసినారు.గురువారం ప్రకృతి రక్షించుకుందాం మనే నినాదంతో విజ్ఞాన దర్శిని,నెహ్రూ సెంటర్,నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర భువనగిరి జిల్లా కేంద్రానికి రాగానే వివిధ ప్రజాసంఘాల నాయకులు,మేధావులు, అభ్యుదయవాదులు,రచయితలు,అంబేద్కర్ వాదులు,ప్రకృతి ప్రేమికులు స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి జయరాజు,రమేష్ మాట్లాడుతూ సమాజ మనుగడలో ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈరోజు రోజురోజుకు ప్రకృతి మొత్తం కూడా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మానవుని యొక్క అభివృద్ధిలో కీలకపాత్ర సైన్స్ పోషిస్తుందని తెలియజేశారు.యువతి యువకులు శాస్త్రీయ పరమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు. ప్రకృతిని కాపాడుకొని వైజ్ఞానిక దృక్పథం పెంపొందించు కోవాలని పిలుపునిచ్చారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మానవునికి స్వేచ్ఛగా జీవించే హక్కు,భూమి,పకృతి,సంపద కుందే హక్కును రాజ్యాంగాన్ని కల్పించిందని అన్నారు. ఈరోజు పాలకులు ప్రజలను మభ్య పెట్టడానికి పెట్టడానికి మూఢత్వాలను ముందుకు తెస్తున్నారని అన్నారు.వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముక్కెర్ల యాదయ్య అధ్యక్షత వహించగా వివిధ ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య,బర్రె సుదర్శన్,సామ మల్లారెడ్డి,శ్రీనివాస చారి,జిట్ట భాస్కర్ రెడ్డి,కొడారి వెంకటేష్,భాస్కర్ నాయక్,రాజేష్ నాయక్,కొండమడుగు నరసింహ,మాటూరు బాలరాజు,దాసరి పాండు,మాయ కృష్ణ,లావుడియా రాజు,బొల్లు యాదగిరి,గడ్డం వెంకటేష్,ఈర్ల పల్లి ముత్యాలు,వనం ఉపేందర్,గంధమల్ల మాతయ్య,సిహెచ్.లక్ష్మి,కొండమడుగు నాగమణి,రాహుల్,బాలయ్య,మల్లేష్,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News