Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

23-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కలిగి ప్రతి అర్జీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణిలో అందిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 39, డివిజనల్ పంచాయతీకి 5, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎంప్లాయిమెంట్, సివిల్ కోర్టు, లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా మార్కెటింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్-1, పంచాయతీ రాజ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా అధికారులు నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News