Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:56 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే
14-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దానిపై దాడులను అడ్డుకోవాలి: బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట: ప్రజాస్వామ్యాన్ని కాపాడేది భారత రాజ్యాంగమేనని, దానిపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సెక్యులర్ విలువలను కాపాడే రాజ్యాంగం దేశానికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలను బలహీనపరచే విధానాలు అమలు చేస్తోందని, ఇవి దేశ ఏకత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాలనలో ప్రతిబింబింపజేయడానికి చేసే ప్రయత్నాలు ప్రమాదకరమని అన్నారు.డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కేవలం పుస్తకం మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, యువజన నాయకుడు ఎడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News