Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే

11-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మార్గదర్శి

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ, కులవివక్ష, సామాజిక అసమానతలపై సూత్రప్రాయంగా, ప్రయోగాత్మకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.పూలే ఆలోచనలు కేవలం సంస్కరణలకే పరిమితం కాకుండా, సమగ్ర సామాజిక పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మౌలిక సూత్రాలను భారతీయ సమాజానికి అన్వయిస్తూ సమాన హక్కుల ఆధారిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు.యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు పీడిత వర్గాల్లో చైతన్యాన్ని రేకెత్తించిన ఉద్యమాలుగా మారాయని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, కుల నిర్మూలన వంటి భావజాలాలను ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు పూలే అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో బచ్చలకూరి గోపి, బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News