Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరాల నివారణపై అవగాహన సదస్సు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరాల నివారణపై అవగాహన సదస్సు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరాల నివారణపై అవగాహన సదస్సు.
March 11, 2026 04:00 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు పాల్గొని నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చుక్కోవద్దని హెచ్చరించారు, డిజిటల్ కరెన్సీ మార్పిడి చేసే విషయంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి ఈ ప్రాంతంలో చాలామంది యువత సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బును పొంది సైబర్ నేరాల్లో చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి డ్రగ్స్ అనే చీడపీడ పట్టిందని ఈ డ్రగ్స్ నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని, పౌరులు డ్రగ్స్ మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు, ఇలాంటి డ్రగ్స్ ను మన సమాజం నుండి ప్రాలదోలాల్సిన, తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. తప్పులు చేసే వారిని సంస్కరించి నేరరాహిత సమాజాన్ని నిర్మూలించాలని అన్నారు. దీనికోసం పోలీసులతో భాగస్వామ్యమై డ్రగ్స్, గంజాయి కి సంభందించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని కోరారు.

చాలా మంది యువత చెడు అలవాట్లకు గురవుతున్నారు, పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనించాలి, తప్పుడు మార్గంలో వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు మందలించాలి అన్నారు. ప్రేమ ఆకర్షణలకు లోనై పిల్లలు బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు అని తెలిపినారు.

అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. రాష్ట్ర పోలీసు ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ఆకుపాముల గ్రామ సమీపంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గుర్తు చేశారు. గ్రామ ప్రజలు రహదారి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. మహిళలను గౌరవించే, పూజించే సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు, మహిళలను గౌరవించాలి అని కోరారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. షి టీమ్స్, పోలీస్ భరోసా టీం పని చేస్తున్నాయి అన్నారు. మహిళల, బాలల రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్... సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఇతర ఎస్సైలు రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, గ్రామ పౌరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News