ప్రజలకు వైద్యం అందించని ప్రభుత్వ ఆసుపత్రి.
ప్రజలకు వైద్యం అందించని ప్రభుత్వ ఆసుపత్రి.
స్థానికం బృందం
పాలకుల చిన్న చూపుతో పడకేసిన ప్రజా ఆరోగ్యం.
1970 సంవత్సరం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం గా ఆవిర్భావo చెందిన రామన్న పేట ప్రభుత్వ ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతుందని ఆశ పడ్డ ప్రజలకు అరచేతిలో వైకుంఠo చూపారు పాలకులు.
చుట్టూ సుమారు 150గ్రామాల ప్రజలకు వైద్యం అందిచాల్సిన బాధ్యత ఉన్న ఆసుపత్రిని పట్టించుకోవడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.
రామన్నపేట పాత తాలూకా అయిన మోత్కూర్,వలిగొండ,చిట్యాల,ఆత్మకూరు, గుండాల,చౌటుప్పల్ ప్రాంతాలకు ఒక్కప్పుడు నాణ్యమైన వైద్యసేవలు అందించిన రామన్నపేట కమ్యూనిటీ వైద్యశాల నేడు మాత్రం దినావస్థలో ఉన్నది. స్వార్థపాలకుల నిర్లక్ష్యనికి నిలువుటద్దంగా మారింది.
ప్రస్తుతపరిస్థితి
30పడకల ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తూ ప్రథమ చికిత్స,పోస్టుమార్టం కేంద్రం గా మాత్రమే మిగిలింది. 100పడకలు ఆసుపత్రి చేస్తామన్న పాలకులు 50 పడకల శిలాలకం పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేశారు తప్ప అభివృద్ధి చేసింది శూన్యం. 20సంవత్సరల కాలంలో అనేక అబద్దాల ప్రకటన చేశారే తప్ప నిధులు తెచ్చింది లేదు. రాజకీయ అవసరాల కోసం ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు.
కడుపు నొచ్చిన, కండ్లు తిరిగనా,పాము కరిచినా, రోడ్డు ప్రమాదం జరిగినా,జ్వరం వచ్చిన కన్న తల్లి లాంటి ఆసుపత్రికి వస్తే సవతి తల్లి లాగా బయటికి పంపడం అనవయితీగా మారింది తప్ప వైద్యం అందించే సాహసం ఏనాడూ చేయలేదు. ఒకప్పుడు రోజుకి 15 సహజ కాన్పులు చేసే ఆసుపత్రి నేడు 2నుండి3కూడా చేసే పరిస్థితి లేదు.
గర్భిణీలు వస్తే కాసుల కోసం ప్రయివేట్ కి పంపడం అనవాయితీగ మారింది. మన డాక్టర్స్కి. కేవలం ప్రాధమిక వైద్యం చచ్చిన శవాలకు పోస్ట్ మార్టం కు పరిమితం చేసి సహజ కాన్పులు కాస్త కోత కాన్పులు గా మార్చారు. ఇలాంటి దూర్భర స్థితి కి చేర్చారు.
శిదిలావస్థలో భవనం -అస్థవ్యస్తంగా మరుగుదొడ్లు, డ్రైనేజీ
ప్రజల ఆరోగ్యం కోసం వైద్యం అందుబాటులోకి తీసుకరావడం కోసం 1970 మరియు 1991లో రెండు సార్లు భవనాలు నిర్మాణం చేశారు. కాని నేడు ఆసుపత్రి మొత్తం పూర్తిగా శిదిలావస్థకు చేరి పెచ్చులుడుతూ ఎప్పుడు కులుతుందో అన్న భయం నిరంతరం రోగులు,డాక్టర్స్,వైద్య సిబ్బంది అరచేతిలో ప్రాణాలు పట్టుకొని కాలం వెళ్ళాదిస్తున్నారు. వర్షం కాలం లో చినుకు పడితే స్లాబ్ లికేజిలతో చిత్తడి చిత్తడి మరియు ఆసుపత్రి ముందు ఉన్న ప్రధాన రోడ్డు ఎత్తు పెంచడం తో నీటి నిల్వతో చెరువులు తలపిస్తుంది. హాస్పిటల్ గోడలపై చెట్లు మొలిచి మహా వృక్షాలుగా మారుతున్నాయి.ముందు భాగం
ఆసుపత్రి మరుగుదొడ్లు, డ్రైనేజీ మొత్తం దుర్గంధంతో కంపుకొడుతుంది. దోమలు,ఈగలకు కేరఫ్ అడ్రస్ గా మారింది. మన దవాఖాన పాత రోగం కోసం వస్తే కొత్త రోగాలు అంటుకుంటున్నాయి.
అందుబాటులో లేని ఆధునిక వైద్య పరికరాలు
మన ఆసుపత్రిలో నిరంతరం వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించడం కోసం అవసర అయిన డిజిటల్ స్కానింగ్,ఎక్సరే, టుడిఈకో, ఆధునిక పరికరాలు లేకపోవడం మూత్ర, తెముడ, రక్త పరీక్షలు ఒక రోజు చేస్తే మరునాడు రిపోర్ట్ ఇవ్వడం అప్పటికే అవస్థలుపడుతున్నారు. ప్రజలు కరెంట్ పోతే జనరేటర్ సౌకర్యం లేదు. ఫ్యాన్లు, లైట్లు నిరంతరం ప్రశ్నర్ధకం ఆందోళన పోరాటం చేస్తే తాత్కాలిక మరమ్మతులు చేసి చేసి చేతులు దులుపు కోవడం పరిపాటిగా మారింది.
నిర్లక్ష్యం లో వైద్య సిబ్బంది
ప్రస్తుతం 24 మంది డాక్టర్స్ ఉండాల్సినహాస్పిటల్ లో కేవలం 4 గురితో కాలం వెళ్ళాదిస్తున్నారు. చిన్న పిల్లల డాక్టర్,గైనకాలజస్టు, మత్తు డాక్టర్,గుండె డాక్టర్ ఇలా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉన్న అరకొర వైద్యులతో దవాఖానను నడిపిస్తున్న దుస్థితి.
ప్రమాదం జరిగి రోగం వచ్చి ఆసుపత్రి కి వస్తే ఆటోలో మంది ఐతేనే పోయినట్టు ఇద్దరు ముగ్గురు రొగులు అయితేనే రూములోనుండి వస్తారు.వైద్యులు,నర్సుల కొరకు గంటల కొద్దిగా నిరీక్షణ తప్పదు ఎవరైనా అడిగితే మాదగ్గర వైద్యం లేదు అని రుస రుస ఆడటం మనం నిత్యం ఎదురకొంటున్న సందర్బంలు అనేకం.రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలయ్యి వస్తే సానిటేషన్ సిబ్బంది ప్రథమ చికిత్స చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉండరు.విధులకు హాజరుకాకున్నా హాజరు వేసుకొని జీతాలు తీసుకుంటున్న చిత్రం ఇటీవల జిల్లా కలెక్టర్ తనిఖీలో తేలింది.
ప్రకటనలతో కాలం వేలాదిస్తున్న పాలకులు
60సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న పాలకులు సందర్బం వచ్చినప్పుడల్లా ప్రజలు ఆందోళన చేసినప్పుడు ప్రకటనలతో కాలం వెళ్ళాదిస్తూ కేవలం హామీలు ఇస్తూన్నారు కాని వాటిని నెరవేర్చటంలో విఫలం చెండుతున్నారు.ఘనమెంతో ఘనకీర్తి కలిగిన పాత తాలూకా,నియోజకవర్గం కేంద్రం ఉన్న రామన్నపేటను నిర్లక్ష్యం చేస్తూ ఏడనకాల వచ్చిన నకిరేకల్,చౌటుప్పల్ లో 100పడకల ఆసుపత్రులు…

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి