Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:20 PM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు

15-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు త్రవ్వడం, పాత బోర్లను మరమ్మతులు చేయించడం, నీటి సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టణంలోని ప్రతి కాలనీలో పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తూ చెత్తను సమయానికి తొలగించడం, కాలువలను శుభ్రం చేయించడం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, వేడి తాకిడి నుంచి రక్షణ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాగజీవన్ రావు, 15 వార్డుల మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News