Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

04-05-2026 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల ప్రజావాణి నిర్వహించబడుతుండగా, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ డివిజన్ కేంద్రాలలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాల్లో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజులలోపు పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే కారణాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 134 ఫిర్యాదులు అందగా, కలెక్టరేట్‌కు 57, సంగారెడ్డి డివిజన్‌కు 29, ఆందోల్‌కు 2, నారాయణఖేడ్‌కు 24, జహీరాబాద్‌కు 22 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News