Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:33 PM

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దాయం విక్రమ్ రెడ్డి; ఎమ్మెల్యే సామేల్

05-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నమ్మిన సిద్ధాంతానికి నైతిక విలువలకు ఆదర్శాలకు మార్గదర్శకంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కామ్రేడ్ దాయం విక్రమ్ రెడ్డి అని ఎమ్మెల్యే మందుల సామెల్,ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామ్రేడ్ దాయం విక్రం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు,అభిమానులు, పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ...

కామ్రేడ్ దాయం విక్రమ్ రెడ్డి రాజకీయ జీవితంలో దాదాపు 30 ఏళ్ల పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కీలక పాత్ర పోషించారన్నారు. నిస్వార్థ సేవాభావంతో ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.1970 వ దశకం లో ఉవ్వెత్తున నడుస్తున్న విప్లవోద్యమంలో పాలు పంచుకుని పి డి ఎస్ యు లో చేరి గ్రామ యువత సహకారంతో రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేసి పోరాడిన వ్యక్తి అన్నారు. తన తండ్రి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దాయం రాజిరెడ్డి ఆలోచనల మేరకు సిపిఐ పార్టీలో చేరి 1981 లో మొదటిసారి వెంపటి గ్రామ సర్పంచ్ గా గెలుపొందడమే కాకుండా తదనంతరం 1988లో ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికయ్యారని తెలిపారు. గ్రామంలో ఐక్యత ప్రశాంతత అభివృద్ధి ప్రధాన అంశాలుగా తీసుకొని తన పాలనను కొనసాగించినట్లు తెలిపారు.1982 లో నవీన యువజన మండల ని స్థాపించి యువతకు క్రీడల పట్ల ఆసక్తిని,సమాజం పట్ల బాధ్యతను పెంపొందించారని అన్నారు.18 ఏళ్లపాటు అప్రహితంగా క్రీడా పోటీలు నిర్వహించి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఎంతో మంది క్రీడా నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడానికి దోహదపడ్డారన్నారు.

నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, నైతిక విలువలు, ఆదర్శాలు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండ ప్రకాశ్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లు కపోతం రెడ్డి,పలు గ్రామాల సర్పంచులు,వివిధ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దాయం విక్రమ్ రెడ్డి; ఎమ్మెల్యే సామేల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News