45వ వార్డు ప్రజలకు గండూరి పావనికృపాకర్ కృతజ్ఞతలు
తనను వరుసగా మూడోసారి గెలిపించి ఆశీర్వదించిన 45వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తనకు బలమని పేర్కొన్నారు.2014లో మొదటిసారిగా వార్డు ప్రజలు తనను గెలిపించారని, అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు కేవలం 54 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. ఈసారి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ 622 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ప్రజలు మూడోసారి అవకాశం ఇవ్వడం పట్ల తాను రుణపడి ఉంటానని, మరో ఐదు సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమవుతానని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయాన్ని సాధించానని, వారి విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని గండూరి పావనికృపాకర్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి