Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

ప్రజాబాటలో విద్యుత్ అధికారుల కు సమస్యలపై వినతిపత్రం

26-02-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

రామన్నపేట ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టేట్ సౌతేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్సి జీఎం యు. బాలస్వామి గురువారం రామన్నపేట మండల కేంద్రంలో పర్యటించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా టిటిడి కల్యాణ మండపం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

వేసవి కాలంలో లోడ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ డి. మల్లికార్జున్ గౌడ్, ఏడిఈ కట్ట శ్రీకాంత్, ఏఈ కోటేశ్వరరావు, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, సిబ్బంది నటరాజ్, విజయకుమార్, మేకల సురేష్, చాంద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతి

ఉప సర్పంచ్ మోటె రమేష్ సిజీఎంను కలిసి పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్థంభాలకు ఎల్‌టీ, 11 కేవీ, 33 కేవీ లైన్లను ఒకే పెద్ద స్థంభాలపై అమర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ లైన్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించాలని వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సిజీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోటె మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాబాటలో విద్యుత్ అధికారుల కు సమస్యలపై వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News