Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:22 AM

ప్రజాస్వామ్యంపై పోలీస్ బూట్లు –సర్పంచుల గొంతు నొక్కిన ప్రభుత్వం

ప్రజాస్వామ్యంపై పోలీస్ బూట్లు –సర్పంచుల గొంతు నొక్కిన ప్రభుత్వం

ప్రజాస్వామ్యంపై పోలీస్ బూట్లు –సర్పంచుల గొంతు నొక్కిన ప్రభుత్వం
December 29, 2025 02:53 PM 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్‌ఎస్ సర్పంచుల ఫోరం ఘాటైన విమర్శలు

అసెంబ్లీ ముట్టడి విఫలం చేయడానికి ప్రివెంటివ్ అరెస్టులు – ప్రజాస్వామ్యంపై దాడి ఆరోపణ

కోదాడ స్థానికం ప్రతినిధి

తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఈరోజు మరో నల్లటి అధ్యాయం జతైంది. ప్రజల తరఫున ప్రశ్నించినందుకే అరెస్టులు, శాంతియుత నిరసనకే అణచివేత చర్యలు చేపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యం బహిర్గతమైంది.

పాత సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచుల ఫోరం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని విఫలం చేయడానికి ప్రభుత్వం ముందస్తు అరెస్టుల అస్త్రాన్ని ప్రయోగించింది. ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ నాయకులు, పాత సర్పంచులను పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించడం ద్వారా ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపించింది.

గ్రామాల అభివృద్ధికి వెన్నెముకలైన పాత సర్పంచులు చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణాల పనులకు సంబంధించిన కోట్ల రూపాయల బిల్లులు నేటికీ చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పనులు పూర్తయినా డబ్బులు రాక సర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. కొందరు ఆత్మహత్యల అంచుల దాకా వెళ్లే పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతోంది.

గ్రామాల్లో అభివృద్ధి స్తంభించిపోవడానికి, సర్పంచుల గౌరవం మట్టిలో కలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్ సర్పంచుల ఫోరం తీవ్రంగా ఆరోపించింది. ఈ మౌలిక సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతే అరెస్టులతో సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య పాలనకు తూట్లు పొడిచినట్టేనని వ్యాఖ్యానించింది.

వెంటనే పాత సర్పంచుల పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి గ్రామ పాలనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొంగల లక్ష్మీనారాయణ, శెట్టి సురేష్ నాయుడు, పొట్టా విజయ కిరణ్, బెల్లంకొండ బ్రహ్మం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ ఉద్ధండు, గుగులోతు మోహన్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News