Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:55 AM

ప్రజా ఉద్యమాల సిపిఐని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలి

28-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వార్డుల్లో సిపిఐ పార్టీ పోటీ

సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపు

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ఉద్యమాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీని ప్రజలు ఆదరించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవనంలో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సూర్యాపేట పట్టణంలో అనేక వార్డుల్లో స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని ఆయన గుర్తు చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, వృద్ధులకు పింఛన్లు అందించాలని సిపిఐ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపట్టిందని తెలిపారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా, ప్రజల పక్షాన నిలబడేందుకు సిపిఐ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో మిత్రపక్షాలతో పొత్తులో భాగంగా పోటీ చేస్తోందని చెప్పారు. ప్రజా ఉద్యమాల రథసారథులైన సిపిఐ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన ప్రజానీకాన్ని కోరారు.ఈ సమావేశంలో బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్, ఖమ్మం పాటి రాము, రేగటి లింగయ్య, ఎండి పాషా, బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, ఐతరాజు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా ఉద్యమాల సిపిఐని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News