Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

26-02-2026 572 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక – అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల పంపిణీ

పేదల సొంతింటి కల సాకారం వైపు అడుగులు – రామన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభం

నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక… నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రామన్నపేట మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇండ్లు అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గురువారం పల్లివాడ గ్రామంలో నాంపల్లి విజయలక్ష్మి–కృష్ణ దంపతులకు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజమవుతోందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, కొన్నింటిలో ఇప్పటికే గృహప్రవేశాలు జరుగుతుండగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల గృహ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల మల్లేష్, నాగులంచ నరేష్, వార్డు సభ్యులు సిరిశాల సోమలక్ష్మమ్మ, మల్లేష్, నాంపల్లి రాజు, మేకల మహేష్, దూదిమెట్ల అశోక్, మేడి మల్లయ్య, సింగపాక నరసింహ, నాంపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News