Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

“ప్రజా పాలన వార్డు సభలో సమస్యల ఊసే లేదు… ప్రచార కోసమా?”: దండంపల్లి

“ప్రజా పాలన వార్డు సభలో సమస్యల ఊసే లేదు… ప్రచార కోసమా?”: దండంపల్లి

“ప్రజా పాలన వార్డు సభలో సమస్యల ఊసే లేదు… ప్రచార కోసమా?”: దండంపల్లి
April 02, 2026 09:32 PM 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలో గురువారం జరిగిన వార్డు (డివిజన్) సభలు “తూతూ మంత్రం”గా మిగిలిపోయాయని”, వాటి ద్వారా ప్రజా ప్రయోజనం ఏమీ లేదని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మండిపడ్డారు. ఈ సభలు కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆర్వాటం కోసమే తప్ప, ప్రజలకు ఎలాంటి నిజమైన ఉపయోగం లేదనిఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం కేవలం “సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రచారం చేసుకోవడం”గా మారిపోయిందని సిపిఎం ఆరోపించింది.

సిపిఎం నాయకులు వివిధ డివిజన్లలో జరిగిన వార్డు సభల్లో పాల్గొని, ప్రస్తుత సమస్యలపై దరఖాస్తులు, వినతులు సమర్పించారు. పట్టణంలోని 11వ డివిజన్‌లో పాల్గొన్న దండంపల్లి సత్తయ్య, అక్కడ పేవ్మెంట్ రోడ్లు నిర్మించిన చోట డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్ల మధ్య నీరు చిక్కుకొని, దుర్గంధం వ్యాపిస్తున్న పరిస్థితినిసీరియస్‌గా లేవనెత్తారు. ప్రజలు ఇంట్లోనే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే సరైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

అర్బన్ కాలనీ గ్రౌండ్లో ప్రహరీ గోడ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్‌సెంటర్కు రెగ్యులర్‌గా వైద్యులు వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. కతాల్ గూడెం–మామిల్ల గూడెంస్మశాన్‌వాటికలకు ప్రహరీ గోడలు, దహన వాటికలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పటిష్టంగా సూచించారు. సర్వాయి పాపన్న విగ్రహం నుంచి మెగాసిటీ, అర్బన్ కాలనీ గుండా మామిళ్లగూడెం ఈదమ్మ గుడి వరకు ఉన్న పురాతన నక్ష దారి ఆక్రమణకు గురైందని సర్వే చేసి హద్దులు స్పష్టం చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ద్వారా అర్బన్ కాలనీ డ్రైనేజీ నీరు స్వేచ్ఛగా పోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠం భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు “ఓల్డ్ ఆఫ్ ద ప్రాపర్టీ” అని ఇంటి యజమాని పేరు లేకుండా ఇంటి నెంబర్ ఇస్తున్న పద్ధతిసరైనది కాదని, ఇంటి టాక్స్ సాదా బైనామీ పద్ధతిలో వేసి, ప్రస్తుతం ఉంటున్న యజమాని పేరుతో ఇంటి నెంబర్ ఇవ్వాలని పటిష్టంగా డిమాండ్ చేశారు. ఖాతాల గూడప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చేలాచూడాలని కోరారు.

5వ డివిజన్లో పాల్గొన్న సిపిఎం పట్టణ కమిటీ సభ్యుడు అవుట రవీందర్, మహిళా ప్రాంగణంలో కార్పొరేషన్ ఎన్నికల హామీ ప్రకారం స్త్రీల స్మశానవాటికకు స్థలం కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలనికోరారు. 2017లో కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకుఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇచ్చి, మౌలిక సదుపాయాలతో పాటు నివాసయోగ్యంగా తయారు చేయాలని పటిష్టంగా డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News