Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

27-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి

స్కూళ్లలో స్టేషనరీ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి

అధికారుల కనుసైగల్లోనే అనుమతి లేని పాఠశాలలు

​ఇన్‌ఛార్జ్ ఎంఈఓకు ఎస్ఎఫ్‌ఐ వినతి

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. మంగళవారం ఎస్ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపు మేరకు చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇన్‌ఛార్జ్ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్నేషనల్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ప్రతి విద్యాసంస్థ తమ ఫీజుల వివరాలను పారదర్శకంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.​జిల్లా విద్యాశాఖ అధికారుల కనుసైగల్లోనే జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తున్న స్టేషనరీ, పుస్తకాల వ్యాపారాన్ని తక్షణమే అరికట్టాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచేలా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు పల్సం సృజన, నాయకులు మణికంఠ, శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News