Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

10-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాయచోటి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్–2023, ఐటీ చట్టం కింద సీఆర్ నంబర్ 132/2026తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచోటి సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పోస్టులు పెట్టడం, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వాటిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ బి.వి. చలపతి స్పష్టం చేశారు.

Sthanikam

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News