Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
April 10, 2026 04:59 PM 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం పటాన్ చెరువు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు. మధ్యస్థ విద్య అనంతరం ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచిస్తూ, విద్యార్థి జీవితంలో తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అత్యంత కీలక దశగా పేర్కొన్నారు. ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని అంకితభావంతో కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నదని, ఈ అవకాశాలను వినియోగించుకుని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, కష్టపడే వారికి విజయమే లభిస్తుందని తెలిపారు.చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ కూడా అవసరమని వివరించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, నిల్వ గది, వంటగదిని పరిశీలించి, నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ తయారీ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కామధేను సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News