Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

09-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యా పటిష్టతకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు. గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/ పాఠశాల ఆవరణలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులతో, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పాలకుల నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష కారణంగా ప్రాథమిక,ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలో పర్యటించి, ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు సందర్శించి తయారు చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.కొందరు అవగాహన రాహిత్యంతో కమీషన్ సిఫార్సుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ విద్యా కమీషన్ సిఫార్సులను పూర్తిగా చదివి, అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టోఫర్,కొడారి వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News