Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

27-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాల ఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

భువనగిరి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాల ఆకాష్ ఈ నెల 15న పాఠశాల సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లి ఈత రాక మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాల ఆకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, బాలుడి మృతికి బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు బాల ఆకాష్ తండ్రి అంతోనిరాజుకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని, “నేను నీకు అన్నగా భావించు… నువ్వు ఎంత వరకు చదివితే అంత వరకు ఉన్నత విద్య ఖర్చులన్నీ నేనే భరిస్తా” అంటూ భావోద్వేగ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News