Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:27 PM

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం
March 28, 2026 06:29 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒప్పందాలతో వేగంగా ముగిసిన వివాదాలు

రామన్నపేట కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 546 కేసులకు పరిష్కారం లభించింది. కక్షిదారుల మధ్య పరస్పర ఒప్పందాలతో వివాదాలు ముగిశాయి.

సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య ఆధ్వర్యంలో కోర్టు హాల్‌లో లోక్ అదాలత్ నిర్వహించారు. రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్, క్రిమినల్, బ్యాంకు, ప్రీ-లిటిగేషన్, పిట్టి కేసులు విచారణకు తీసుకుని పరిష్కరించారు.

బ్యాంకు, ప్రీ-లిటిగేషన్ కేసుల ద్వారా రూ.5,18,350 నగదు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ… చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం, డబ్బు వృథా చేసుకోవడం కంటే లోక్ అదాలత్‌ను వినియోగించుకుని పరస్పర ఒప్పందాలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎస్ఐలు,

బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News