Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్

పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్

 పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్
24-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులపై కఠిన ఆదేశాలు

పెండింగ్ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకు డెడ్‌లైన్

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) కింద పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను వేగవంతంగా పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయడంతో పాటు పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గుండాల మండల పంచాయతీ కార్యాలయంలో గ్రామాల వారీగా పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వసూలైన పన్నుల వివరాలు, లక్ష్యాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బందికి జీతాలు సమయానికి చెల్లించాలనీ, ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.

అలాగే గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం గుండాల గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్, మొక్కల పెంపకం, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సక్రమంగా పెంచి గ్రామాల్లో నాటే కార్యక్రమాలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలకమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News