Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

పంచాయతీ' అప్పు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా భారంగా పరిణమించిన అప్పు

29-12-2025 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల్లోనూ అంతర్మథనం

పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ లు పదవీ బాధ్యతలు చేపట్టినా, వారిలో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన, ఓడిన వారు అప్పుల భారంతో సతమత మవుతున్నారని గ్రామాల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరు గుతోంది. గెలుపొందినవారు పదవిని దక్కించు గ్రామ పంచాయతి కున్నా, ఖర్చుల భారం తీరక అప్పుల పాలైన పరిస్థితి నెలకొంది. ఇక ఓడిపోయిన అభ్యర్థులు పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకుని ఆర్థికంగా కుదేలవుతున్నా రని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.

- ఖర్చుల లెక్క తారుమారు

ఎన్నికల ముందు వేసుకున్న ఖర్చుల అంచనాలు ఒకలా, గెలిచిన తర్వాత ఎదురయ్యే వాస్తవ పరిస్థి తులు మరోలా ఉన్నాయని కొందరు నూతన సర్పంచులు వాపోతున్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా 'మొదటి పౌరుడు'గా నిలబడ్డామని, కానీ ఇప్పుడు అప్పులే మిగిలితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే సందిగ్ధతలో ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

- సానుభూతి రాజకీయాలపై ఆశలు

ఓడిపోయిన అభ్యర్థుల్లో కొందరు, భవిష్యత్తులో ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవుల కోసం మళ్లీ ఎన్ని కలలో పోటీ చేస్తే సానుభూతి ఓట్లు దక్కుతాయనే ఆశతో ఉన్నట్లు సమాచారం.

-ఓటర్లలో మార్పు అవసరం

డబ్బులకు లొంగకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు తీసుకుని ఓటు వేయడం వల్ల ఒక్కరోజు లాభం తప్ప, పోటీలో నిలబడిన కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే ప్రజా ప్రతినిధులు బాధ్యతగా సేవ చేస్తారని, అప్పుడే వారిని ప్రశ్నించే హక్కు ప్రజలకు సార్థకం అవుతుందని పేర్కొంటున్నారు.

Sthanikam

పంచాయతీ' అప్పు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా భారంగా పరిణమించిన అప్పు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News