Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీపై క్రెడిట్ రాజకీయాలు వద్దు: రాంపాక నాగయ్య

23-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ విషయంలో క్రెడిట్ రాజకీయాలు చేయడం తగదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాంపాక నాగయ్య విమర్శించారు.

2022 ఏప్రిల్ 13న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక–వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

అయితే ఇటీవల జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా తానే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను అమలు చేయకుండా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తోందని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విమర్శలకు పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీపై క్రెడిట్ రాజకీయాలు వద్దు: రాంపాక నాగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News