Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:40 PM

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: ప్రిన్సిపాల్ రాహత్ ఖాన్

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: ప్రిన్సిపాల్ రాహత్ ఖాన్

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: ప్రిన్సిపాల్ రాహత్ ఖాన్
March 24, 2026 03:25 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ రక్షణపై విద్యార్థులకు పిలుపు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) మరియు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలను వాడకుండా, వాటికి బదులుగా బట్ట లేదా చెక్కతో తయారైన వస్తువులను ఉపయోగించడం అవసరమని అన్నారు. దీని ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్ట్ విశ్లేషకులు డి. తేజస్వి, ఎన్. అజిత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం సమాజానికి ముప్పుగా మారిందని, దాని వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని అన్నారు. బట్ట, చెక్కతో తయారైన గ్లాసులు, సీసాలు, సంచులు, చెంచాలు వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి టి. శ్రీనివాస్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News