Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం
12-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాసలీలలు, లంచాల ఆరోపణలు… పదిహేను రోజుల్లో వరుస ఘటనలు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో వరుస వివాదాలు చోటుచేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై స్టేషన్‌కు వచ్చిన మహిళతో అనుచిత సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఈ ఘటనలు ముగిసేలోపే, సహాయ ఉప ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన అనుచిత ప్రవర్తన వీడియో బయటకు రావడం కలకలం రేపింది. పదిహేను రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల వల్ల శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికే కొన్ని ఘటనలపై స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శాఖ ప్రతిష్ఠ కాపాడాలి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవాలంటే పోలీసు అధికారులు నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Sthanikam

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News