Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

27-03-2026 351 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి సేవలందించారు.

గత ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రూ.50 వేల సొంత ఖర్చులతో బెన్నూరి హరీష్-అపర్ణ దంపతులు, బెన్నూరి శైలేష్-విజయ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. “అన్నదానం అన్నిదానాల్లో శ్రేష్ఠం” అని పేర్కొంటూ వారి సేవలను గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందకరమని, శ్రీ సీతారామచంద్రుల కృప గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కంకణాల లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ పావురాల మచ్చగిరి, కంబాలపల్లి మధు, కడమంచి నరసింహ, దండిగా పాండు, నాంపల్లి లింగయ్య, బెల్లి నరసింహ, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News