Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

30-12-2025 469 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు

పల్లివాడ, స్థానిక ప్రతినిధి:

పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.

చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్‌లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

Sthanikam

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News