Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:55 PM

పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం

01-05-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో తుమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. గ్రామ అభివృద్ధికి విద్యే బాట అని పేర్కొంటూ, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు గ్రామానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు శాలువాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో తుమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. గ్రామ అభివృద్ధికి విద్యే బాట అని పేర్కొంటూ, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు గ్రామానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు శాలువాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News