Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:03 AM

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

05-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 54 మందికి అందజేత – అత్యుత్తమ మార్కులకు నగదు బహుమతి ప్రకటన

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 54 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమని సూచించారు.

పదో తరగతిలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఇది విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించి ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు యమా సంతోష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయురాలి కోరిక మేరకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుడు శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News