Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

20-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్: విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, విద్యా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, మెనూ ప్రకారం రుచికరమైన, పోషకాహారం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతోనే వంటలు చేయాలని ఆదేశించారు.

పాఠశాల వంటగది, మరుగుదొడ్లు పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆర్.ఓ ప్లాంట్ ద్వారా అందుతున్న తాగునీటి సౌకర్యాన్ని కూడా పరిశీలించారు.

అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థి పోలీస్ అవుతానని చెప్పగా, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడాలని ప్రోత్సహించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారో తెలుసుకుని, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పరీక్షల సమయంలో భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా రాయాలని, మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News