Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

23-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పరీక్షలు పూర్తయ్యాక ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

Article Image

యాదగిరిగుట్ట,

పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పరీక్షలు పూర్తయ్యాక ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News