Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

18-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూరు, ఆలేరు మండలాల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జిల్లా పరిషత్ హై స్కూల్‌లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తుతో భద్రంగా తరలించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News