Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:40 AM

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

18-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతోనే తరలించాలని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతోనే తరలించాలని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News