Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్

11-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా రాసి ఉత్తీర్ణత సాధించాలని చాట్రాయి మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో–1) మాసగిరి శ్రీనివాస్ సూచించారు. విద్యార్థులు క్రమపద్ధతిలో చదువుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

మర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఎంఈవో, పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, సమయపాలన, మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు, పరీక్షల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఇష్టపడి చదివితే విజయం తప్పక దక్కుతుందని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆయన సూచించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి చాట్రాయి మండలాన్ని ఏలూరు జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పాస్ సర్టిఫికెట్‌ను తల్లిదండ్రుల చేతిలో పెట్టినప్పుడు వారికి కలిగే ఆనందానికి అవధులు ఉండవని తెలిపారు.

అనంతరం పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రఘు తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News