Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

24-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్: ట్రాన్స్‌ఫార్మింగ్ రీసెర్చ్ అండ్ అకాడెమిక్స్ ఇన్ ది AI యుగం (OER–TRAAI 2026)” పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎస్. సుధర్శన్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, డిజిటల్ లెర్నింగ్, ఓపెన్ యాక్సెస్ వనరులు, ఆన్‌లైన్ బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయని తెలిపారు.

గౌరవ అతిథి డా. ఈ. మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని, పరిశోధనలో కొత్త దృక్కోణాలను అవలంబించాలని సూచించారు. ఆధునిక పోటీతత్వ ప్రపంచంలో నిలవాలంటే అంతరశాఖా అధ్యయనాలు అవసరమన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా ప్రక్రియలో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి సదస్సులు విద్యార్థులు, అధ్యాపకులకు కొత్త అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

సదస్సు నిర్వహణ కార్యదర్శి డా. పి. శంకరయ్య వివరాలు తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ నుంచి సుమారు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 45 పరిశోధనా పత్రాలు స్వీకరించి, పీర్ రివ్యూడ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.

సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు పాల్గొన్నవారికి ఉపయోగకరంగా నిలిచాయని, సదస్సు ద్వారా OER, AI ప్రాముఖ్యతపై విస్తృత చర్చలు జరిగాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News