Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి

11-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్‌లో భాగంగా, ఖేడ్ మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటును నమోదు చేసుకున్నారు. 2వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్‌లో ఆమె సాధారణ ఓటరుగా హాజరై ప్రజాస్వామ్యానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.ఈ సందర్భంగా ఎన్.ఉమాహారతి మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దారి తీసే నాయకత్వాన్ని ఎన్నుకునే మహత్తర అవకాశమని,అందరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండగా, అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లు కూడా క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం సంతోషకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News