Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

27-01-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద “చలో ఢిల్లీ” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తయినా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ లలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు, అలాగే తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోస్ మహేష్ చారి, జిల్లా కన్వీనర్ బయ్యా రాజేష్, బీసీ యువజన సంఘం నాయకులు పరాల సాయి, ఉప్పల మధుసూదన్, తండు నాగేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News