Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:40 AM

ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు

11-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆటో డ్రైవర్ ఒకరు తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.

వివరాల ప్రకారం విజయవాడకు చెందిన సుబ్బారావు కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆటోలో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే హడావుడిలో సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కొంతసేపటి తర్వాత విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది ప్రయాణికులదేనని భావించి వారిని వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు.

పోలీసులు బ్యాగును పరిశీలించగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి నగలను ఆయనకు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్‌ను కూడా ఎస్పీ అభినందించారు.

Sthanikam

ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News