Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు

27-04-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను టిజీవో సంగారెడ్డి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, నోట్ పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసి సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజీవో జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. వైద్యనాథ్, సెక్రటరీ డాక్టర్ ఎస్. సంతోష్ కుమార్, సహాధ్యక్షులు బలరాం, ఉపాధ్యక్షులు పర్వతాలు, ఐనేష్, లలిత కుమారి, రామాచారి, వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రాజిరెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు పుష్పలత, భూగర్భజలశాఖ ఉపసంచాలకులు డాక్టర్ జి. మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News