Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి
March 09, 2026 06:26 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, చెవి వినికిడి పరీక్ష యంత్రం, లాప్రోస్కోపీ యంత్రాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సుమారు రూ.4 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

గత ప్రభుత్వం పేదల వైద్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి ఒక్క రూపాయి కూడా అందలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గంలో సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించిందన్నారు.

పేదల వైద్యానికి రెండున్నర లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే సంజీవిని కార్డులు, టెలీ మెడిసిన్ సేవలను కూడా ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు.

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా సుమారు పది మండలాల ప్రజలకు సేవలు అందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను నేటి నుంచి అందిస్తున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ.10 కోట్లతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం కూడా మంజూరు అయినట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న మంత్రి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News