Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గల దారి భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై రైతుల ఆవేదన

26-02-2026 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ నమోదు… విచారణకు డిమాండ్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్వతాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో 2023 సంవత్సరంలో నిర్వహించిన రీ సర్వేలో ఆర్‌.ఎస్‌. నెంబర్‌

161/3C, ఎల్ పి యం 987లో 63శెంట్లు

భూమి ప్రైవేటు దారిగా నమోదు అయింది.

ఈ దారి భూమి విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉండగా, సంబంధిత కార్యాలయంలో కాకుండా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెం. 6556/2025గా తండ్రి నుండి కొడుకుకు గిఫ్ట్ డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

గొర్ల సర్వాంకర రెడ్డి అనే వ్యక్తి విస్సన్నపేట కు చెందిన కొంతమంది డాక్యుమెంట్ రైటర్ ల ద్వారా మధ్యవర్తిత్వం నడుపుకొని ఈ ప్రక్రియ జరుపుకొని దీని ధారంగా దారి భూమిపై హక్కు చూపిస్తూ చదువులేని, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత రైతులు తెలిపారు. ప్రైవేటు దారిగా నమోదైన భూమిని ఇతర రిజిస్ట్రార్ పరిధిలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అనేది అనుమానాస్పదంగా ఉందని వారు పేర్కొన్నారు. ఏది చేయాలన్నా తమ వద్ద ఆర్ధిక స్థోమత లేదని, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు తమవని, తమ పరిస్థితిని అనువుగా చేసుకొని, ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, దీనికి నందిగామ సబ్ రిజిస్ట్రార్ అతనికి పూర్తిగా సహకరించి, 2023లో రీ సర్వే లో కూడా దారిగా నమోదై వున్న మరియు మహారాజశ్రీ తిరువూరు కోర్టు వారి సమక్షంలో ఈపీ పెండింగ్ లో ఉన్న ఈ దారి భూమిని రిజిస్ట్రేషన్ చేశాడని వాపోయారు

ఈ నేపథ్యంలో నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాత్రపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే రద్దు చేసి తగు చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. తమకు న్యాయం చేసి దారి భూమిని రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా దారి భూములు రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతే పొలాల్లోకి వెళ్ళటానికి దారి మిగులుతుందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు నిజంగా నందిగామ సభ రిజిస్టార్ దారి భూమి రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి అతనిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ లు మరలా జరగకుండా తగిన చర్యలు చేయాలని రైతులు కోరుతున్నారు

Sthanikam

నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గల దారి భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై రైతుల ఆవేదన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News