Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు

07-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వరంగల్ జిల్లాలో ఆదివారం జన్ను ఆనంద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్ను ఆనంద్‌ను ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూ లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బట్టి ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించడం కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆయన సేవలను అభినందిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, వేణుమాధవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు

Article Image

వరంగల్ జిల్లాలో ఆదివారం జన్ను ఆనంద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్ను ఆనంద్‌ను ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూ లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బట్టి ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించడం కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆయన సేవలను అభినందిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, వేణుమాధవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News