Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:56 AM

నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి

14-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు ఇవ్వాలి: డి రవి

సూర్యాపేట,

ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న ఆక్రమ నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి డి రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతూ ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు విడుదల చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.

దేశ స్థాయి విధానానికి సమానంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో యువజన ప్రకటన విడుదల చేసి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా నియామక ప్రకటనలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ కాలంలో ప్రకటించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్తగా అదనపు ఉద్యోగాలను ప్రకటించలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ యువత సమస్యను గమనించి ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ అంశంపై సమగ్రంగా చర్చించి యువతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం పోరాడుతున్న వారిపై పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని సూచించారు. లేకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News